ఇటిక్యాల, వెలుగు : సాంఘిక సంక్షేమ, గురుకుల, కస్తూర్బా వసతి గృహాల్లో అవసరమైన మైనర్ రిపైర్స్ చేయించేందుకు వార్డెన్లు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలని గద్వాల అడిషనల్కలెక్టర్ నర్సింగ్ రావు ఆదేశించారు.
బుధవారం వల్లూరు గ్రామంలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను ఆయన తనిఖీ చేశారు. దెబ్బతిన్న డ్రైనేజీ కాలువ స్థానంలో ఇంకుడు గుంత నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. కుంగిపోయిన సెప్టిక్ ట్యాంక్, పాక్షికంగా కూలిన ప్రహరీకి వెంటనే రిపేరు చేయిస్తామని హామీ ఇచ్చారు.
జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు ఇంజినీరింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ అవసరమైన నివేదికలను ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ ఫుడ్ క్వాలిటీ, అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.

